చంటి పిల్లలున్న తల్లులకు చర్మం కాంతి వంతంగా ఉండాలంటే....!

Durga
 1. గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత ఆడవారిలో శారీరకంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. బరువు పెరగడం, పొట్టలపై చారలు, జుట్టు రాలిపోవడంలాంటివి తరచూ వేధించే సమస్యలు. పెళ్లి, ప్రసవం తర్వాత చాలామంది బరువు పెరుగుతుంటారు. దీన్ని నివారించేందుకు భోజనం చేసిన ప్రతిసారీ గ్రీన్ టీని తాగితే ఫలితం ఉంటుంది. 2. ఆపిల్‌ సిడాల్‌ వెనిగర్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవడమే కాక అధిక బరువును నియంత్రిస్తుందని హాలీవుడ్ అందాలరాశుల నమ్మకం. శరీరం మునుపటి కాంతిని సంతరించుకోవడానికీ, పొట్టపై చారలను నివారించడానికి మన భారతీయ మహిళలు కొబ్బరినూనెను వాడుతుంటారు. దీనితో చారలు పూర్తిగా తగ్గకపోయినప్పటికీ సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది. 3. చంటి పిల్లలున్న తల్లులు తరచూ నిద్రలేమితో బాధపడుతుంటారు. ఫలితంగా కళ్లు ఉబ్బినట్లు ఉండటమే కాక నల్లటి చారలు ఏర్పడతాయి. దీనిని నివారించటానికి జపాన్‌ మహిళలు క్యారమిల్‌ టీ బ్యాగును వేడి నీటిలో ముంచి చల్ల బడ్డాక కళ్లపై పెట్టుకుంటారు. 4.కాన్పు తర్వాత సరైన సంరక్షణ తీసుకోక పోవడంతో చర్మం నిర్జీవంగా తయారవుతుంది. అలాంటప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ నిద్ర పోయేదాకా తరచూ చల్లనీటితో ముఖాన్ని కడుగుతూ ఉంటే.. చర్మం తేటగాను, కాంతి వంతంగాను అవుతుంది. అలాగే స్నానానికి ముందు ఆలివ్‌ నూనెతో మర్దన చేసుకుంటే, ఇంకా స్నానం చేసే నీటిలో రెండు చుక్కల ఆలివ్‌ నూనె వేసుకుంటే చర్మం మిలమిలలాడుతుంటుంది  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: